About Me

కిక్కు కోసం ఏది లెక్కచేయరు.....మందా మజాకా!

కరోనా కరవు కాలంలో నెల రోజులకు పైగా మందు లేక అల్లాడి పోయిన మందుబాబులు దేశ వ్యాప్తంగా  షాపులు తెరుచుకోడంతో తమ విశ్వరూపం చూపారు. కరోనా లేదు గిరోనా లేదు మందు కొడితే కరోనా ఫరార్ అంటూ రోడ్డెక్కారు. వైన్ షాపుల ముందు భారి లైన్లు కట్టారు. సామాజిక దూరం పాటించకుండా ఒకరిపై ఒకరు పడుతూ తోసుకుంటూ అరుచుకుంటూ హంగామా చేశారు.  మందు కోసం  ఎంత ఓపికంటే అది ఇవ్వకుంటే ఎవడి పీకనైనా పిసికేద్దామన్నంత కోపం. దేశ రాజధానిలో అయితే మందు బాబుల రద్దీ భరించ లేక షాపులు తెరిచిన వెంటనే తిరిగి మూసి వేశారు. పోలీసుల పహరా ఉన్నా నియంత్రించ లేని పరిస్థితి ఉండడంతో వెంటనే షాపులు మూసి వేశారు.
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో మద్యం కోసం షాపుల ముందు కిలోమీటర్ల మేర క్యూలు కట్టారు. తెలంగాణ రాష్ట్రంలో అయితే మందు బాబులది మరో విశాధ గాధ. తెలంగాణలో ఇంకా మందుకు సర్కార్ వారి ఆనతి లభించ లేదు. పక్క రాష్ట్రం అయిన ఆంధ్ర లో షాపులు తెరవడంతో సరిహద్దు జనం అక్కడి కెళ్ళి మందు కోసం క్యూలు కట్టారు. భద్రాద్రి సమీుండి పంలోని ఆఁధ్ర సరహద్దులో గల ఏటపాలెం లో తెలంగాణ మందు బాబులు రోజంతా మద్యం కోసం ఎండను కూడ లెక్క చేయకుండా క్యూలల్లో ఓపికగా నిలుచున్నారు.
తమిళ నాడు సరిహద్దులో ఉన్న అనంతపురం జిల్లాలో కూడ సమీప తమిళనాడు వాసులు క్యూలు కట్టారు. ఆంధ్ర  రాష్ట్రంలోని  బెజవాడలో కరోనా కేసుల ఉధృతి వల్ల మొదటి రోజు షాపులు తెరవ లేదు. తెల్లవారి నుండే ఇ్కడ షాపుల ఎదుట క్యూలు కట్టానా తెరవక పోవడంతో ఉసూరుమన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో వైన్ షాపుతించ లేదు.లు తెరుస్తారా లేదా అనేది ప్రస్తుతం ఓ పెద్ద చర్చ నీయాంశంగా మారింది. రెడ్ జోన్లు మినహాయించి గ్రీన్, ఆరెంజ్ జోన్లలో సైతం మద్యం అమ్మకాలకు ఇంకా అనుమతించ లేదు. అతరల రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో ఒక్క హైదరాబాద్ నగరం  మినహా  ఇతర అన్ని జిల్లాలలో కరోనా నియంత్రణలోనే ఉంది. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నిర్ణ యం తీసుకోవాల్సి ఉఁది. దేశంలో మద్యం అమ్మ కాలు అత్యధికంగా జరిగే రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి. 

Post a Comment

0 Comments