About Me

అరటి పండ్లలో సంపూర్ణ ఆహారం




అరటి పండ్లు సంపూర్ణ పోషకాహారం.అరటిలో కార్బోహైడ్రేట్లు,పొటాషియం మరియు ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి.ఈ పండ్లను ఎప్పుడు తినాలో ఎప్పుడు తిన కూడదో అనే విషయాల మీద అనేక అపోహలు ఉన్నాయి. రాత్రి వేళ అరటి పండ్లు తిన రాదని ఆయుర్వేదం చెబుతోంది. క అరటి పండుతింటే రాత్రి వేళ మంచి నిద్ర పడుతుందని ఆధునిక న్యూట్రిషియన్ల సలహాలు ఉన్నాయి.శరీరంలో స్వతహాగా తయారుకాని ట్రిప్టోఫాన్‌ అనే ఎమినో యాసిడ్‌ ఉంటుంది.ఈ ఎమినో యాసిడ్‌ నిద్రను క్రమబద్ధీకరించే సెరటోనిన్‌ అనే న్యూరో ట్రాన్స్‌మీటర్‌ ఉత్పత్తికి తోడ్పడుతుంది.సెరటోనిన్‌
మెదడులో ఉత్పత్తయ్యే అత్యంత ముఖ్యమైన రసాయనం.ఇది ఒత్తిడి,కుంగుబాటులను తగ్గించి నిద్రలేమిని పోగొడుతుంది.అరటి పండ్ల వల్ల శరీరానికి ఎక్కువ విటమిన్లు మరియు ఫైబర్ లభిస్తుంది.అరటిలో పోషకాలు మరియు ఖనిజాలు ఉంటాయి.సాయంత్రం ఒకటి లేదా రెండు అరటిపండ్లు తింటే మీకు రాత్రి బాగా నిద్ర పడుతుంది. ఒక పెద్ద అరటిపండులో 487 మి.గ్రా. పొటాషియం ఉంటుందని న్యూట్రీషియన్స్ చెబుతున్నారు. వయస్సైనవారి శరీరానికి కావల్సిన పొటాషియం కన్నా సుమారు 10 శాతం ఎక్కువ ఉంటుంది.విటమిన్ బి -6 రక్తంలో తెల్ల రక్త కణాల సంఖ్యను పెంచడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.
అరటి పండు పొద్దున  అఁటే మరీ  ఖాళి కడుపుతో కాకుండా ఇడ్లి,ఉప్మా వంటి లైట్ టిఫిన్స్ తిన్న తర్వాత తింటే మంచిదని నిపుణుల సలహా.అరటి పండు ఉదయం తింటే వెండి,మద్యాహ్నం తింటే బంగారంలా మన శరీర ఆరోగ్యానికి దోహదం చేస్తుందని పెద్దలు చెబుతుంటారు.రాత్రి వేళ తినే కన్నా సాయంత్రం స్నాక్స్ తిన్న తర్వాత  ఒకటి రెండు అరటి పండ్లు తింటే ఏ సమస్య ఉండదు.రాత్రివేళ మంచి నిద్ర పడుతుంది.రాత్రి వేళ అరటి పండు తింటే సైనస్  వంటి సమస్యలు ఉన్న వారికి ఇబ్బందులు ఎదురవుతాయని  ఆయుర్వేదం చెబుతుంది.అందుకే సాద్యమైనంత వరకు రాత్ర వేళ కాకుండా   సూర్యాస్తమయానికి ముందే తింటే సమస్యలు ఉండవు.
బాగా పండిన అరటి పండ్లు పైన నల్లటి మచ్చలు  గల వాటిని ఛీటా అరటి పండ్లు అంటారు.బట్టీలో మగ్గిన అరటి పండ్లను బయటికి తీసిన  ఒకటి రెండు రోజుల తర్వాత పండ్లు బాగా మగ్గి నల్లటి మచ్చలు ఏర్పడతాయి.అలాంటి పండ్లు తింటే ఆరోగ్యానికి మరీ మంచిది.

Post a Comment

0 Comments