About Me

వైజాగ్ లో భారి ప్రమాదం...ఎల్ జి పాలిమర్స్ కంపెనీలో గ్యాస్ లీక్

విశాఖ పట్నం సమీపంలోని ఆర్.ఆర్ వెంకటాపురం లో ఓ కెమికల్ ఫాక్యరీలో గ్యాస్లీక్ అయి భారి ప్రమాదం జరిగింది. వందలసంఖ్యలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మృతుల సంఖ్య కూడ ఎక్కువగానే ఉంది. తెల్లవారు జామున 3 గం. ప్రాంతంలో గ్యాస్ లీక్  జరిగింది. గత రెండు నెలలుగా ఫ్యాక్టరి మూత పడి  ఉండడంతో నిల్వ ఉన్న స్టెరీన్ అనే గ్యాస్ లీక్ అయినట్లు తెలుస్తోంది.  జనం ఇండ్లోనే ఉండి ోయి తలుపు బింగించుకోవడంతోఊపిరి ఆడక తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు.  ఇండ్పోలలో నుండి జనం బయటకి రావాలని పోలీసులు మైకుల లో హెచ్చరికలు చేసి బయటికి రప్పించారు. బయటికి రాలేని వారి ఇండ్ల తలుపులు పగల కొట్టి వారిని బయటికి సీసుకువచ్చి ఆసుపత్రులకు తరలించారు.
గ్యాస్ పీల్చిన వారు ఎక్కడి కక్కడే కుప్ప కూలి పోయారు. రసాయనంతో దద్దుర్లు, కళ్లలో మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు  పడ్డారు. కొందరు అపస్మాకరకస్థితిలో రోడ్డుపై పడిపోయారు.పశువులు, పక్షులు ప్రాణాలు విడిచాయి. ఉదయం 10 గం వరకు 8 మంది చనిపోయారు. ఊపిరి ఆడక కండ్లు కనిపించక తల్లడిల్లి పోయారు. పిల్లల పరిస్థితి అయితే వర్ణణాతీతం.
ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ 1997లో ఆర్ఆర్ వెంకటాపురం గ్రామంలో నెలకొల్పబడింది. 213 ఎకరాల విస్తీర్ణంలో 168 కోట్ల రూపాయల ప్రాజెక్టు వ్యయంతో ఈ సంస్థ ప్రారంభమైంది. ఈ కంపెనీ ప్రతిరోజు 417 టన్నుల పాలిస్టెరీన్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ప్రమాదంపై పలువురు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రదాన మంత్రి నరేరేంద్ర మోది, హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, మముఖ్యమంత్రి వై.ఎస్. మోహన్ రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్త పరిచారు. గ్యాస్ లీక్ వ్యవహారంపై ముఖ్యమత్రి విచారణకు ఆదేశించారు.

Post a Comment

0 Comments