About Me

దేశంలో లక్షకు చేరిన కరోన కేసులు

దిల్లీ: దేశంలో కొవిడ్‌-19 మహమ్మారి నానాటికీ మరింత ఉద్ధృత రూపం దాలుస్తోంది. తాజాగా రికార్డు స్థాయిలో ఒక్కరోజులోనే 5,242 మంది కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యారు. ఇప్పటివరకు 24 గంటల వ్యవధిలో వెలుగుచూసిన అత్యధిక కేసులు ఇవే. దీంతో దేశంలో వైరస్‌ బారి పడ్డవారి మొత్తం సంఖ్య లక్షకు చేరువైంది. సోమవారం ఉదయానికి కరోనా కేసుల సంఖ్య 96,169గా నమోదయింది. కొత్తగా 157 మంది కొవిడ్‌ దెబ్బకు మృత్యువాతపడటంతో, మొత్తం మరణాల సంఖ్య 3,029కి పెరిగింది. మహారాష్ట్రలో మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది.

Post a Comment

0 Comments