About Me

పూట గడవని దీనావస్తలో మ్యూజిక్ డైరెక్టర్ చక్రి తల్లి...దాతలు ముందుకు వచ్చి సహాయం

ఒకప్పటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ చక్రి కుటుంబ సబ్యులు (తల్లి,సోదరుడు) పూట గడవని దీనావస్థలో ఉన్నారని వార్తలు రావడంతో దాతలు సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు.కోవిద సహృదయ ఫౌండేష సంస్థ వ్యవస్థాపకురాలు అయిన నిర్మాత డాక్టర్ అనూహ్యా రెడ్డి రెండు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు  చక్రికుటుంబ సబ్యులకు అంద చేశారు.అనూహ్య రెడ్డి సహాయం అందించిన తర్వాత కొందరు చక్రి కుటుంబ సబ్యులకు సహాయం చేసేందుకు  ముందుకు వస్తున్నారని సమాచారం.40 ఏళ్ళ వయస్సులో 15 డిశంబర్ 2014 లో చనిపోయిన చక్రి సుమారు 100 సినిమాలకు సంగీతం సమకూర్చాడు.ఆయన మరణం తర్వాత భార్య కు తల్లికి మద్య ఆస్తుల వివాదం జరిగి విడి పోయారు.చక్రి తల్లి విద్యావతి,సోదరుడు మహిత్ నారాయణ్ హైదరాబాద్ లోని మణికొండలో ఉంటున్నారు.

Post a Comment

0 Comments