About Me

మావోయిస్టుల పేరుచెప్పి .... సీతక్కను అడ్డుకున్న పోలీసులు ?


మాజి నక్సలైట్ కే ధమ్ఖి -మావోయుస్టులున్నారని వెనక్కి పంపిన పోలీసులు
గిరిజన ప్రాంతాలలో నివసిస్తున్న వారికి నిత్యావసర వస్తువులు పంపిణి చేసేందుకు బయలు దేరిన ములుగు ఎమ్మెల్యే  కాంగ్రేస్ పార్టి జాతీయ మహిళా కాంగ్రేస్ ప్రధాన కార్యదర్శి  ధనసరి అనసూర్య (సీతక్కను) పోలీసులు అడ్డుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి  మండలం పరిదిలోని రేగళ్ళ  గ్రామానికి వెళుతుండగా మార్గం మద్యంలో పోలీసులు ఆమె వాహనాన్ని ఆపారు. లక్ష్మి దేవిపల్లి మండల ఎస్.ఐ ప్రవీణ్ కుమార్ సీతక్క వాహనాన్ని నిలిపి వేసి ముందుకు వెళ్ళ నీయ లేదు. నిత్యావసర సరుకులు పంపిని చేసేందుకు  అనుమతిలేదని చెప్పడంతో సీతక్క వెనక్కి వెళ్లారు. లాక్ డౌన్ కాలంలో ఎవరూ పస్తులుండరాదని ఎమ్మెల్యే సీతక్క ప్రతి రోజు గిరిజన గ్రామాలకు వెళ్ళి నిత్యావసరాలు అంద చేయడం దిన చర్యగా పెట్టుకున్నారు.
సీతక్క వాహనాన్ని అడ్డుకోవడంపై సి.ఐ ని స్థానిక మీడియా వివరణ కోరగా రేగళ్ల ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నాయని అఁదుకే అనుమతించ లేదని చెప్పారు. పైగా నిత్యావసర సరుకుల పంపిణీకి కూడ ఆనుమతి లేదని  సి.ఐ తెలిపారు. లాక్ డౌన్ లో అనేక ప్రాంతాలలో అనేక మంది నిత్యం నిత్యావసరాలు పంపిణి చేస్తున్నారు. ఎక్కడా పోలీసులు ఇంత వరకు ఎవరిని అడ్డుకోలేదు. ఒక వేళ సీతక్కను అనుమతించక పోవడానికి   ప్రధానంగా మావోయిస్టుల కదలికలే కారణం అయితే శాంతి భద్రతల సమస్య కనుక అదే విషయం చెబితే సరిపోయేది. నిత్యావసరాల పంపిణీకి అనుమతిలేదని ఓ పోలీస్ అధికారి  చెప్పడం ఆశ్చర్యం కలిగించింది.
గిరిజనులకు నిత్యావసరాలు అందచేస్తూ సీతక్క  అందరి చేత ప్రశంసలు పొందు తోంది. సీతక్క సేవలకు జాతీయ అంతర్జాతీయ మీడియాలో ప్రధాన గుర్తిెంపు లభించింది.
ఒక వేళ ఇది ఓర్వలేక అధికార పక్షం నేతలు సీతక్కకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసుల చేత మావోయిస్టుల పేరు చెప్పి అడ్డుకున్నారా ఏమని అనుమానాలు కూడ వ్యక్తం అవుతున్నాయి. ఏదైనా ఒక వేళ శాంతి భద్రతల సమస్య కాపాడటం పోలీసుల ప్రధాన కర్తవ్యం కనుక సమస్య అదే అయితే సమస్య లేదు. ఆమె శాసన సభ్యురాలుకనుక పోలీసుల ఆదేశాలు పాటించాల్సిందే తప్పదు.ఎర్రటి మండుటెండల్లో  ఎడ్ల బండ్లలో,ట్రాక్టర్లలో వెళుతూ ఏ వాహనాలు కూడ వెళ్ల లేని గ్రామాలకు సరుకులు మోసుకు వెళుతూ పేదల ఆకలి తీరుస్తున్న సీతక్క సేవలకు ఎవరైనా సెల్యూట్ చేయాల్సిందే.

Post a Comment

0 Comments