About Me

నోవల్ కరోనా వైరస్ ను నాశనం చేసే వాక్సీన్ ఇటలీలో పుట్టింది ?

ఇది ప్రపంచానికి ఓ పెద్ద శుభ వార్త. నోవల్ కరోనా వైరస్‌ ను నాశనం చేసే వాక్సీన్ తయారంది. ఇటలి ఈ వాక్సీన్ తయారు చేసినట్లు వెల్లడించింది. రోమ్‌లోని స్పల్లంజానీ ఆస్పత్రిలో ఎలుకలపై ముందుగా నిర్వహించిన పరీక్షలు విజయ వంతం అయ్యాయని ఇటలి న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఎస్ఏ వెల్లడించింది.‘టకీస్’రూపొందించిన ఈ వ్యాక్సిన్ ఎలుకలపై ప్రయోగించగా యాంటిబాటింక్ కణాలు ఉత్పత్తి అయ్యాయని తెలిపింది.మానవ కణాలలో కోవిడ్-19 వైరస్‌ను వ్యాక్సిన్ మొదటి ప్రయత్నంలో నియంత్రించిందని టకిస్ సీఈఓ లుయిగి ఆరిసిచియో ను ఉటంకిస్తూ ఏఎన్ఎస్ఏ తెలియజేసింది. కరోనాకు వ్యాక్సిన్‌ తయారీలో ఇది అత్యంత అధునాతన దశ అని, ఈ వేసవి తరువాత క్లినికల్ ట్రయల్స్ జరుగుతాయని అన్నారు. వ్యాక్సిన్ ద్వారా కరోనావైరస్‌ను తటస్థీకరించడం ప్రపంచంలో ఇదే తొలిసారని,ఆ పనిని టకీస్ చేసిందని, మానవులపై కూడా ఇది పని చేస్తుందని భావిస్తున్నట్టు స్పల్లాంజనీ హాస్పిటల్ వర్గాలు తెలిపాయి.
ఎలుకల్లో యాంటీబాడీలు అభివృద్ధి చేసిందని, ఇది వైరస్‌ను మానవ కణాలకు సోకకుండా నిరోధించగలదని అరిసిచియో అన్నారు. ఫలితాలు ప్రోత్సాహకరంగా, అంచనాలకు మించి ఉన్నాయని ఇటాలియన్ పరిశోధకులు వ్యాఖ్యానించారు. అమెరికన్ ఔషధ సంస్థ లీనియాఆర్ఎక్స్‌తో టకిస్ మరింత మమ్మురంగా పరిశోధనలు సాగించనున్నట్టు అరిసిచియో పేర్కొన్నారు.కరోనా వైరస్ ఇటలీలో మరణ మృదంగం మోగించింది. దేశంలో ఈ వ్యాధి భారిన పడి 30 వలకు పైగా ప్రాణాలు కోల్పోయారు.

Post a Comment

0 Comments