About Me

చార్టర్ ఫ్లైట్‌లో అమెరికాకు

లాక్ డౌన్ కారణంగా ఇడింయాలో చిక్కుకుపోయిన అమెరికాలో పనిచేస్తున్న ఎన్ఆర్ ఐలు చార్టర్ ఫ్లైట్ లో వెళ్ళేందుకు సిద్దపడుతున్నారు. లాక్‌డౌన్ కారణంగా అమెరికాలో పనిచేసే భారతీయుల్లో చాలా మంది స్వదేశంలో చిక్కుకున్నారు. తమ ఉద్యోగాలను కాపాడుకోవాలంటే వీరి తప్పనిసరిగా అమెరికాకు వెళ్లకతప్పదంటున్నారు.  అంతర్జాతీయ విమాన ప్రయాణాలు నిలిపివేయడంతో చార్టర్ ఫ్లైట్‌లో వెళ్లే మార్దం ఒక్కటే ఉంది. ఈ ప్రత్యేక విమానం కోసం 9 లక్షల డాలర్లు (రూ.6.75 కోట్లు) ఖర్చుచేయాలి. భారత్‌లో చిక్కుకున్న పలువురు ఓ గ్రూప్‌గా ఏర్పడి ప్రయాణానికి సిద్దపడుతున్నారు. 
టైమ్స్ ఆఫ్ ఇండియా  ఈ వార్తకు సంభందించిన వివరాలు వెల్లడించింది. 
ప్రత్యేక చార్టర్  విమానం కోసం 9 లక్షల డాలర్లు చెల్లించడానికి ఎవరూ ముందుకు రారేమో అనుకున్నాం.. ప్రత్యేక విమానంలో సీట్లు నిండటం కష్టమని భావించాను.. కానీ, దీనిపై సోషల్ మీడియాలో అనూహ్యమైన స్పందన వచ్చిందని హైదరాబాద్‌కు చెందిన ఓ హెచ్-1బీ వీసాదారుడు వ్యాఖ్యానించాడు. పేరు చెప్పడానికి ఇష్టపడని ఆ వ్యక్తి తన భార్య, రెండేళ్ల కుమారుడితో కాలిఫోర్నియాలో ఉంటున్నాడు. ఇటీవల వారితో కలిసి భారత్‌కు రాగా.. ఇదే సమయంలో లాక్‌డౌన్ విధించడంతో ఇక్కడ చిక్కుకున్నారు. తిరిగి అక్కడకు వెళ్లేందుకు ఎదురుచూస్తున్నామని తెలిపాడు.

తన లాంటి మరో 100 మంది హెచ్-1బీ వీసాదారులు స్వదేశంలో చిక్కుకున్నారని, తాము నాన్-అమెరికన్స్ కావడంతో అమెరికా ప్రభుత్వం ప్రత్యేక విమానాలను ఏర్పాటుచేయలేదన్నారు. 283 సీట్ల సామర్ధ్యం (బిజినెస్ సీట్లతో సహా) ఉన్న విమానంలో 100 మంది ప్రయాణీకులు 900,000 నుంచి 950,000 డాలర్లు, 278 మంది సీటింగ్ సామర్ధ్యం ఉన్న బోయింగ్ విమానానికి ఒక్కొక్కరికీ 850,000 నుంచి 900,000 డాలర్లు వరకు అవుతుంది. అయినా, ఉద్యోగం పోతుందనే భయంతో ఎంత ఖర్చయినా అమెరికా వెళ్లడానికి వెనుకాడటం లేదన్నాడు. 

Post a Comment

0 Comments