About Me

ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు వ్యతిరేకంగా పోరాటం...విద్యా పరిరక్షణ కమిటి పిలుపు







ప్రైవేటు
 విశ్వవిద్యాలయాలను అనుమతించడాన్ని తీవ్రంగా 
ఖండించిన తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ
ఐక్యఉద్యమానికి పిలుపు 

 రాష్ట్రంలో  ప్రైవేటు విశ్వవిద్యాలయాలను అనుమతించడానికై తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం గెజెట్ న జారీ చేసింది. ఈ యూనివర్సిటీలను తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులైన పల్లా రాజేశ్వర్ రెడ్డి,మల్లారెడ్డి తదితరులు స్థాపించడం అత్యంత గర్హనీయం. దుర్మార్గం. కరోనా వైరస్ సంక్షోభాన్ని  అదునుగా తీసుకొని అటు నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం, కార్మిక వర్గాన్ని దెబ్బకొట్టి నట్టుగానే ఇటు చంద్రశేఖరరావు ప్రభుత్వం ప్రభుత్వ యూనివర్సిటీల విద్వంసానికి ఒడిగట్టింది.
ప్రత్యేక రాష్ట్రం కోసం తెగించి పోరాడి న ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ లాంటి ప్రభుత్వ యూనివర్సిటీలను బలహీనపరిచి మూసివేయడానికి ఈ ప్రైవేటు యూనివర్సిటీలు వస్తున్నాయి రాజకీయ సిద్ధాంతాలకు,తాత్విక చర్చలకుమారు పేరైన ఉస్మానియా,కాకతీయ యూనివర్సిటీలు అసమాన త్యాగాల తో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం తెగించి పోరాడాయి. అవి ఇవ్ళాల తెలంగాణ యువతకు నియామకాలు ఎందుకు లేవని, ప్రభుత్వ విద్యకు నిధులు ఎందుకు లేవని ప్రశ్నిస్తున్నాయి. నిలదీస్తున్నాయి. యివి సంఘటిత ఉద్యమ రూపం తీసుకోకుండా చేయడానికే తెలంగాణ రాష్ట్ర సమితి ఈ ప్రైవేటు యూనివర్సిటీల కు అనుమతి ఇస్తుంది.

 ఉస్మానియా యూనివర్సిటీని నాశనం చేయడానికే హైదరాబాద్ చుట్టుపక్కల  మెజారిటీ ప్రైవేటు యూనివర్సిటీల కు అనుమతి ఇచ్చారు.అలాగే కాకతీయ యూనివర్సిటీ ని ధ్వంసం చేయడానికి వరంగల్ లో  హసన్ పర్తి లో  ప్రైవేటు విశ్వవిద్యాలయానికి అనుమతిచ్చారు.

కనుక ప్రైవేటు యూనివర్సిటీల అనుమతులను వెంటనే విరమించుకోవాలని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ డిమాండ్ చేస్తున్నది.అలాగే  విద్యార్థులు,  అధ్యాపకులు, ఉపాధ్యాయులు ప్రజలు ,ప్రజాస్వామిక వాదులు కలసి రాష్ట్రంలోని ప్రభుత్వ కళాశాలల్లో,యూనివర్సిటీల పటిష్ట తకై, పైవే టు యునివర్సిటీ లకు వ్యతిరేకంగా
దీర్ఘకాలిక ఐక్య ఉద్యమం కోసం  సిద్దం కండని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ పిలుపు నిస్తుంది .

*ప్రొఫెసర్ కె. చక్రధరరావు*
*ప్రొఫెసర్ జి.హరగోపాల్*
*ప్రొఫెసర్ కె. లక్ష్మీనారాయణ*

Post a Comment

0 Comments