About Me

యుద్ధ ప్రాతిపదికన వలస కూలీలను స్వస్థలాలకు చేర్చాలి...పొన్నాల లక్ష్మయ్య టీపీసీసీ మాజి అధ్యక్షులు

 సామాజిక మాద్యమమం ఫేస్ బుక్ వేదికగా టీపీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య వలస  కార్మికుల దీనావస్థల పై కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాల అమానవీయతను ఎత్తి చూపారు. 

దేశం,రాష్ట్రం,సామాన్య ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యల పట్ల, కేంద్ర ప్రభుత్వానికి గానీ, రాష్ట్ర ప్రభుత్వానికి గానీ, స్పష్టత లేక, విధివిధానాలు లేక, వలస కార్మికులు ఇబ్బంది పడుతున్న విషయాన్ని మీ దృష్టికి తీసుకువస్తున్నాను. 

 అసలు లాక్డౌన్ ప్రకటించే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోలేదు, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను తప్పుపట్టడం కాదు. రాజకీయం చేయడం కాదు, మానవతా దృక్పథంతో చేయాల్సిన పనుల గురించే నేను మాట్లాడుతున్నాను. 

 వలస కార్మికులు తమ స్వస్థాలలకు వెళ్లడానికి అనుమతి ఇచ్చిన నేపధ్యంలో... కలుగుతున్న ఇబ్బందులను ప్రభుత్వాల దృష్టికి తీసుకుపోవాల్సిన అవసరముంది.

 ముఖ్యమంత్రి గారేమో మూడు లక్షలని, మున్సిపల్ శాఖామంత్రి గారేమో ఆరున్నర లక్షలని. మరోమంత్రి గారేమో పదహారు లక్షల మందని పొంతన లేకుండా చెబుతున్నారు.

 మంచిర్యాలలో కానీ, సంగారెడ్డిలో కానీ, వీళ్ల బాధలు మనం చూస్తున్నాము. సరైన ప్రణాలిక లేకుండా లక్షలాది మంది ఉన్న హైదరాబాద్ లోనే ఒకరోజంతా ఏడువేల మందిని ట్రైన్ ఎక్కించామని చెప్పుకునే దౌర్భాగ్య పరిస్థితి నెలకొంది.

 ఇన్ని లక్షల మందికి  వాళ్లు ఇచ్చిన ఫోన్ నంబర్లు, ఆన్లైన్ సిస్టం కానీ సరిగా పనిచేయక ఇబ్బందులు పడి నడుచుకుంటూ వెళ్లిన దాఖలాలు ఉన్నాయి.

 మానవీయ కోణంలో ఆలోచించక, కనీసం వీరి ప్రయాణపు ఖర్చులు కూడా
భరించలేక, ఈ ప్రభుత్వాలు వ్యవహరించడం బాధాకరం.

 మొదటి ప్యాకేజీ లక్షా డెబ్భైనాలుగు  వేల నుండి అరవై వేలు మాత్రమే ఖర్చు పెట్టారు. ఈ మాత్రం జనాలను తరలించడానికి, ప్యాకేజీ నుండి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ రాయితీలు ఇవ్వాల్సిందిపోయి వారిని మరింత ఇబ్బందుల్లోకి నెట్టారు.

 ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్' , కు వచ్చిన వేలాది కోట్లన్ని ఏమయ్యాయి?
రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన  వందల కోట్లు ఏమయ్యాయి.?

ఈ పరిస్థితుల్లో పార్లమెంట్ నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్,లకు ఇరవై వేల కోట్లను కేటాయించి ఖర్చు పెట్టడం దురదృష్టకరం.

వీరిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉన్నది. గతంలో 2008 లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వరదలు వచ్చినపుడు పూర్తిస్థాయి సహకారాన్ని అందచేసింది.

 ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ, కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఉన్న చోట గానీ సహాయ పడాలని శ్రీమతి సోనియాగాంధి గారు చెప్పడాన్ని స్వాగతిస్తున్నాను.

 ఇది దిశానిర్దేశం లేని అమానవీయ కోణంలో పనిచేస్తున్న ప్రభుత్వాలకు చెంపదెబ్బగా భావిస్తున్నాను.

 ఇప్పటికైనా యుద్ధ ప్రాతిపదికన వారిని స్వగ్రామాలకు చేర్చాలని మనవి చేస్తున్నాను.

Post a Comment

0 Comments