About Me

వైరస్ చైనాలాబ్ సృష్టి...కేంద్ర మంత్రి నితిన్ గడ్గరి

అమెరికా అధ్యక్షులు ట్రంప్ సహా అనేకదేశాధి నేతలు కరోనా వైరస్ పుట్టుక గురించి చైనాను ఇప్పటికే టార్గెట్ చేశారు.
కేంద్ర రోడ్లు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్గరి వారి సరసన చేరి పోయాడు. కరోనా వైరస్ సహజ సిద్దంగా పుట్టింది కాదని వూహాన్ లోని లాబరేటరీలోనే సృష్టించారని సంచలన వ్యాఖ్యలు చేసారు.
'మనం కరోనాతో కలిసి బతకడం అలవాటు చేసుకోవాలి ఎందుకంటే ఈ వైరస్‌ సహజ సిద్ధంగా వచ్చింది కాదు..ల్యాబ్‌లోంచి వచ్చింది..వైరస్ మూలాల గురించి ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు దీనికి వ్యాక్సిన్ అభివృద్ధి చేసేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నాయి.ఇంత వరకు వ్యాక్సిన్ రాలేదు..వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే ఎలాంటి సమస్య ఉండదు' అని గడ్కరీ అన్నారు.

‘రెండో సమస్య డిటెక్షన్ మెథడాలజీ.. దాని కోసం సరైన పద్దతి అవసరం.. దీని వల్ల తక్షణమే వైరస్‌ను గుర్తించగలం.. ఇది ప్రమాదవశాత్తు ప్రయోగశాల నుంచి వచ్చిన వైరస్..ఇది సహజమైంది కాదు,భారత్ సహా ప్రపంచం అనేక దేశాల శాస్త్ర వేత్తలు పరిశోదనుల చేస్తున్నారు..ఈ మహమ్మారికి వాక్సిన్ కనుగోవడం ఒక్కటే పరిష్కారం కాగలదు..టీకా అందుబాటులోకి వచ్చిన తరువాత ఎటువంటి సమస్య ఉండదు’అని వ్యాఖ్యానించారు.

'కరోనా వైరస్‌పై పోరుతోపాటు ఆర్ధిక యుద్ధం కూడా చేయాల్సి అవసరం ఉంటుంది..మనది పేద దేశం కాబట్టి నెలల కొద్ది లాక్‌డౌన్ కొనసాగించలేమని'స్పష్టం చేశారు. లాక్‌డౌన్ కారణంగా పనుల్లేక వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కార్మికులు భయంతో స్వస్థలాలకు వెళ్లిపోతున్నారని,వారంతా ఆర్ధిక కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత వారి తిరిగొస్తారనే ఆశాభావం వ్యక్తం చేశారు. 

Post a Comment

0 Comments