About Me

ఆత్మ నిర్భర్ భారత్ పాకెజి వివరాలు వెల్లడించిల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్



ప్రధాని మోదీ ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీకి సంబంధించిన వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం వెల్లడించారు. ముఖ్యంగా ఈ ప్యాకేజీలో ఎవరికి ఎంతెంత కేటాయించారో కూడా ఆమె వివరించారు. ఈ ప్యాకేజీలో 15 అంశాల్లో కేటాయింపులు ఉంటాయన్నారు. అందులోని వివరాలను రోజుకొకటి చొప్పున వెల్లడిస్తామని తెలిపారు. అందులోభాగంగా, ఈరోజు ఎంఎస్ఎంఈలకు సంబంధించి ప్రకటిస్తున్నామని తెలిపారు.ఆత్మ నిర్భర భారత్‌కు ఐదు అంశాలను మూల స్తంభాలన్నారు. స్వయం సమృద్ధితో కూడిన భారత్‌ నిర్మాణం కోసమే భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించినట్లు ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు.
ఆత్మ నిర్భర్‌ భారత్‌ అంటే స్వయం ఆధారిత భారత్‌ అని ఆర్థిక, మౌలిక, సాంకేతిక, దేశ జనాభా, డిమాండ్‌ సూత్రాలు ఆత్మ నిర్భర భారత్‌కు మూల స్తంభాలుగా చెప్పారు.స్వయం సమృద్ధితో కూడిన భారత్‌ నిర్మాణం కోసమే భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించినట్లు ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు.

తమ ప్రభుత్వం గతంలో తీసుకువచ్చిన సంస్కరణలు.. ఇప్పుడు మంచి ఫలితాలనిస్తున్నాయని నిర్మలా సీతారామన్‌ అన్నారు. బ్యాంక్ అకౌంట్ల కారణంగా కరోనా కష్టకాలంలో.. పేదల అకౌంట్లలోకి నేరుగా నగదు బదిలీ చేయగలిగామని పేర్కొన్నారు. కోట్లాది మంది ప్రజలకు ధాన్యం, ఉచిత సిలిండర్లు అందజేశామని తెలిపారు. ఇప్పటి వరకు గరీబ్ కళ్యాణ్‌ ప్యాకేజీ ద్వారా ఆర్థిక ఉద్దీపన అమలు చేశామని.. స్వయం ఆధారిత భారత్‌కు కావాల్సిన పునాదులు ఇప్పటికే మోదీ సర్కారు పూర్తి చేసిందని వెల్లడించారు. పదిహేను రకాల ఉద్దీపన పథకాలను ఈరోజు ప్రకటించబోతున్నామని హర్షం వ్యక్తం చేశారు. చిన్న మధ్యతరహా పరిశ్రమలకు... ప్రభుత్వ గ్యారంటీతో మూడు లక్షల కోట్ల రూపాయల అప్పులు ఇస్తామని స్పష్టం చేశారు. అక్టోబర్ 31 వరకు ఎంఎస్‌ఎంఈలు ఈ పథకం ద్వారా అప్పులు తీసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Post a Comment

0 Comments