About Me

దిల్ రాజు రెండో వివాహం...శుభాకాంక్షలు తెలిపిన కూతురు

ప్రముఖ నిర్మాత దిల్ రాజు రెండో వివాహం చిత్ర పరిశ్రమ లోపలా బయట ప్రస్తుతం ఆసక్తి కర చర్చగా మారింది.దిల్ రాజు మొదటి భార్య అనిత 2017 లో హార్ట్ ఎటాక్ తో చనిపోయారు. దిల్ రాజు వివాహం చాలా సాదాసీదాగా జరిగింది.
నిజామాబాద్ జిల్లాలోని నర్సింగ్‌పల్లిలోని వెంక‌టేశ్వ‌ర స్వామి గుడిలో రాత్రి 11 గంటల సమయంలో తమ భందువుల అమ్మాయి తేజస్వినితో దిల్ రాజు వివాహం జరిగింది. ఈ సందర్భంగా దిల్ రాజు కూతురు హన్షిత  తన తండ్రి వివాహం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది.  నువ్వు నాకు అన్ని విషయాల్లో అండగా నిలిచావు. అన్నీ సమయాల్లోనే నువ్వే నా బలం. మీ వలన అందరం సంతోషంగా ఉన్నాం. మన కుటుంబ సంతోషం కోసం మీరు ఎన్నో చేశారు. కొత్త జీవితం ప్రారంభించబోతున్న మీకు శుభాకాంక్షలు. మీరిద్దరు సంతోషంగా ఉండాలని, ప్రతి రోజు అద్భుతంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ఐ లవ్ యూ లాట్, యువర్స్ హన్షు అంటూ హన్షిత తన ప్రకటనలో  పేర్కొన్నారు.
కరోనా లాక్ డౌన్ కారణంగా వివాహానికి తక్కువ మందినే ఆహ్వానించారు. చిత్దిర పరిశ్రమ ప్రముఖులు చాలా మంది వాటాస్ప్ లో , ట్విట్టర్లో అభినందనలు తెలిపారు.

Post a Comment

0 Comments