About Me

సెక్యులర్ సందేశం...కరోనాపై యుద్ధం...ఆలయాలు,మజీదులు,గురుద్వారాల శుద్ధిలో ఇమ్రానా సైఫి


ఆమె శుద్ధి చేస్తున్నది మతాలపేరిట మనుషులు పెంచుకున్న కల్మషాన్ని

దేశ రాజధాని ఢిల్లీలో అంతగా చదువు కోని ఓ సాధారణ  32 ఏళ్ల  ముస్లీం మహిళ ఇమ్రానా సైఫీ. సిటిజెన్స్ అమెండ్ మెంట్ ఆక్ట్ కారణంగా చెల రేగిన మత విద్వేశాల నుండి  ఇంకా కోలుకోని ఉత్తర ఢిల్లీ ప్రాంతంలో సెక్యులర్ భావాలకు  సంకేతంగా నిలిచింది. మత సామరస్యాన్ని చాటుతూనే మరో వైపు  ఆమె కరోనా పై పోరాడే యోధురాలిగా మారింది.బురఖా ధరించి గుళ్ళు, గురుద్వారాలు, మజీదులు అనే తేడా లేకుండా ఇమ్రానా సైఫి తిరుగుతూ కరోనా వైరస్ నివారణ కోసం రసాయనాలు స్ర్పే చేసే పనిలో పడింది.ముగ్గురు పిల్లల తల్లి అయిన ఇమ్రానా సైఫి భుజానికి హాండ్ స్ర్పే మిషన్ డబ్బా తగిలించుకుని  ప్రార్థనా మందిరాలు,ఆలయాల లోపలా వెలపలా రసాయనాలు స్ర్పే చేయడం దిన చర్యగా మార్చుకుంది.ఆమెతో పాటు మరో ఇద్దరు మహిళలను కూడ తోడుగా చేసుకుని కరోనా పై యుద్ధం సాగిస్తోంది.ఇమ్రానా సైఫి భర్త ప్లంబర్ పనిచేసే వాడు కాగా ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ వల్ల పనులు లేక పోవడంతో ఇంట్లోనే ఉంటున్నాడు.భర్తకు తోడుగా చిన్ని చిన్న పనులు చేస్తూ చేదోడుగా ఉంటూవచ్చిన ఇమ్రానా ప్రస్తుత సంక్షోభంలో పిల్లలను పోషించుకునేందుకు ఈ పని తోడ్పడుతోందని పేర్కొంది.రంజాన్ మాసంలో పొద్దంతా ఒక్కపొద్దుతో గడుపుతూనే స్థానిక సామాజిక సేవా సంక్షేమ సంఘం  ఇచ్చిన హాండ్ స్ర్పే డబ్బాలో  రసాయనాలు నింపి ఆలయాలు శుద్ది చేసే పని కొనసాగిస్తోంది.ఆలయాలులో రసాయనాలు స్ర్పే చేసే పనికి ఏ ఆలయ పూజారాలు అడ్డు చెప్పలేదని స్వాగతించి సహాయం చేస్తున్నారని ఇమ్రానా చెప్పు కొచ్చారు.మజీదుల నుండి వినిపించే అజా,గుళ్ళ నుండి వచ్చే గంటల శబ్దాలు తనకు ఒకే భావన స్ఫురింప చేస్తాయని  సెక్యులర్ సిద్దాంతాలు అంతగా తెలియని ఇమ్రానా వివరించారు.భారతదేశంలో మతసామరస్యతను కొనసాగిస్తూ మనమంతా ఒక్కటే నని అందరం కల్సి ఉందామనే సందేశం పంపాలను కుంటాన్నానని ఇమ్రా సైఫి తనను కల్సిన మీడియా వారికి వివరిస్తున్నారు.డిల్లీ మీడియా కు ఇమ్రానా సైఫి ఓ వార్తంశంగా మారింది.

Post a Comment

0 Comments