About Me

ఆ మహమ్మారి వుహాన్ లాబ్ నుంచే వచ్చింది.....ట్రంప్

వురాలజీ ల్యాబ్‌లో కరోనా వైరస్ సృష్టి...... సాక్ష్యాలున్నాయ్ : డొనాల్డ్ ట్రంప్


కరోనా ఓ వైపు ప్రపంచ వ్యాప్తంగా స్వైర వీహారం చేస్తోంటే మరో వైపు అమెరికా చైనా రెండు అగ్ర రాజ్యాల మద్య అంతరం పెరుగుతోంది. చైనాపై అమెరికా అధ్యక్షులు ట్రంప్ మరో మారు అగ్రహ జ్వాలలు వెల్లగక్కాడు.కరోనా వైరస్ వుహాన్‌లోని వైరాలజీ ల్యాబ్ నుంచే బయటకు వచ్చిందని ట్రంప్ ఆరోపించారు.వైరస్ ల్యాబ్ నుంచే బయటకు వచ్చిందని చెప్పేందుకు అవసరమైన అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నప్పటికీ ఇప్పటికిప్పుడు వాటిని బయటపెట్టబోమని ట్రంప్ అన్నారు. అలా బయటపెట్టే అనుమతి తనకు కూడా లేదని ఓ ప్రశ్నకు సమాధానంగా ట్రంప్ పేర్కొన్నారు. విచారణ జరుగుతోందని, త్వరలోనే వాస్తవాలు బయటకు వస్తాయని అన్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ వైఖరి పట్ల మొదటి నుండి అసహనంతో ఉన్న ట్రంప్ మరో మారు విమర్శలు కురిపించారు.కరోనా వైరస్ పుట్టినిల్లుగా పేరు తెచ్చుకున్న వుహాన్ సిటీ నుంచి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటిదాకా ఒక్క నివేదికను కూడా ఎందుకు తెప్పించుకోలేకపోతోందని నిలదీశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన అనంతరం ప్రపంచ ఆరోగ్య సంస్థ తీసుకునే నిర్ణయాలన్నీ వివాదాస్పదంగా ఉన్నాయని, అవన్నీ చైనా వైపు మొగ్గు చూపేలా ఉన్నాయని ఆరోపించారు. కరోనా వైరస్ వుహాన్ వైరాలజీ ఇన్‌స్టిట్యూట్‌లో తయారు చేసినట్లు నివేదికలు ఉన్నప్పటికీ.. వాటిపై డబ్ల్యూహెచ్ఓ దర్యాప్తు చేపట్టకపోవడం వెనుక కారణాలేంటని ప్రశ్నించారు.

Post a Comment

0 Comments