About Me

కరోనా బాంకు రుణాలు...తక్కువు వడ్డీకే

కరోనా దెబ్బకు ఆర్థిక స్థితి గతులు చిన్నా భిన్నం అయ్యాయి. కోలుకునేందుకు చాలా కాలం పట్టవద్దని చెబుతున్నారు. ఈ పరిస్థితులలో బాంకులు ఉదారంగా రుణాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. కోవిడ్ 19 వ్యక్తి గతరుణాలు ఇచ్చేందుకు బాంకులు నిర్ణయించాయి.
బ్యాంకుల్లో వేతన అకౌంట్ కలిగిన  ఉద్యగులు, బ్యాంక్ నుంచి పెన్షన్ తీసుకుంటున్న వారు, ఇదివరకే బ్యాంక్ నుంచి రుణం పొందిన వారికి ఈ ఫెసిలిటీ అందుబాటులో ఉంది. లాక్ డౌన్ వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు ఈ తరహా రుణాలు తీసుకోవచ్చు. ఈ నేపథ్యంలో రెగ్యులర్ పర్సనల్ లోన్స్‌కు, కోవిడ్ 19 పర్సనల్ లోన్స్ మధ్య ఉన్న వ్యత్యాసాలను గమనిద్దాం. 

బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు జాబ్ ప్రొఫైల్, నెలవారీ ఆదాయం, ఎంప్లాయర్ ప్రొఫైల్, క్రెడిట్ స్కోర్ వంటి పలు అంశాల ప్రాతిపదికన పర్సనల్ లోన్స్ అందిస్తాయి. అయితే కోవిడ్ 19 రుణాలను మాత్రం శాలరీ, లోన్, పెన్షన్ అకౌంట్లు కలిగిన వారికే ఇస్తున్నాయి.
పర్సనల్ లోన్ కింద రూ.50,000 నుంచి రూ.20 లక్షల మధ్యలో రుణం పొందొచ్చు. అయితో కోవిడ్ 19 పర్సనల్ లోన్స్ కింద రూ.5 లక్షల వరకే లోన్ లభిస్తుంది. కనీసం రూ.25 వేలు రుణం తీసుకోవలసి ఉంటుంది. వడ్డీ రేట్ల విషయానికి వస్తే.. రెగ్యులర్ పర్సనల్ లోన్స్‌పై 9 నుంచి 24 శాతం మధ్యలో వడ్డీ రేట్లు ఉంటాయి. ప్రాసెసింగ్ ఫీజు 3 శాతం. అయితే కోవిడ్ 19 లోన్స్‌పై వడ్డీ రేటు 7.2 శాతం నుంచి 10.5 శాతం మధ్యలో ఉన్నాయి. బ్యాంకులు ప్రాసెసింగ్ ఫీజు కూడా వసూలు చేయడం లేదు. 



Post a Comment

0 Comments