About Me

అమెరికాలో చైనా సంతతి సైంటిస్ట్ బింగ్ లియు (37)దారుణ హ‌త్య‌

కరోనా వైరస్ - కోవిడ్ -19 పై కీలక పరిశోదనలు చేస్తున్న బింగ్ లియు
అమెరికాలోని పెన్సిల్వేనియాలో చైనాకు చెందిన శాస్త్రవేత్త బింగ్ లియు (37)దారుణ హ‌త్య‌కు గుర‌య్యాడు. కరోనా వైరస్‌పై కీలక పరిశోధనలు చేస్తున్న బింగ్ లియు అతనికి పరిచయం ఉన్న వ్యక్తిగా చెబుతున్న హోగూ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కాల్చిచంపినట్లు అనుమానిస్తున్నారు.బింగ్ లియును కాల్చి చంపి ఆ తర్వాత తనను తాను కాల్చుకుని మరణించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.నిందితుడి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.బింగ్‌ లియు మెడ, తల భాగంలో తీవ్ర గాయాలున్నట్లు ఫోరెన్సిక్‌ రిపోర్టులో తేలింది.హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.లియు పరిశోధనలకు,ఈ హత్యకు సంబంధం ఉండి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

Post a Comment

0 Comments