About Me

గెలాక్సీ ఎస్20 సిరీస్ స్మార్ట్‌ఫోన్ల పై ఆఫర్ ప్రకటించిన సామ్ సంగ్

లాక్ డౌన్ సడలింపులతో ఈ కామర్స్ దిగ్గజాలు ఆన్ లైన్ అమ్మకాలను ప్రారంభించిన తరువాత ప్రముఖ మొబైల్ తయారీదారు శాంసంగ్ వినియోగదారులకు ఆఫర్ ప్రకటించింది. లాక్‌డౌన్ తర్వాత స్మార్ట్‌ఫోన్ విక్రయాలు పడిపోయిన నేపథ్యంలో ఈ ఆఫర్ ను తీసుకొచ్చింది.  గెలాక్సీ ఎస్20  సిరీస్ స్మార్ట్‌ఫోన్ల ప్రీ బుకింగ్స్‌పై ఇ-వోచర్‌ అందిస్తున్నట్టు కంపెనీ వెల్లడించింది. పరిమిత కాల ఆఫర్  రూ.4 వేల విలువ చేసే వోచర్  అందిస్తున్నట్టు శాంసంగ్  ప్రకటించింది. భారత్‌లో గెలాక్సీ ఎస్20 సిరీస్ కోసం శాంసంగ్ ప్రీబుకింగ్స్ ప్రారంభించిన సందర్బంగా కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఈ ఆఫర్ అందుబాటులో వుంచింది.   ఈ వోచర్‌లను శాంసంగ్ అధికారిక వెబ్‌సైట్ శామ్‌సంగ్.కామ్‌లో లభించే ఇతర గెలాక్సీ ఉత్పత్తుల కొనుగోలుకు ఉపయోగించుకోవచ్చు. ఈ నెల (మే)  20 వరకు మాత్రమే ఈ ఆఫర్  అందుబాటులో వుంటుంది.

Post a Comment

0 Comments