About Me

ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ -20 లక్షల కోట్లతో భారి ప్రాజెక్టు ప్రకటించిన ప్రధాని

 

దేశంలోను బయటి ప్రపంచంలోను మనల్నికరోనా  వీడే పరిస్థితి లేదు. మరికొంత కాలం కరోనాతో సహవాసం చేయక తప్పని పరిస్థితిలో ప్రధాన మంత్రి దేశ ప్రజల ఆర్థిక స్థైర్యం, ఆత్మస్థైర్యం పెంపొందించే దిశగా ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ పేరిట 20 లక్షల కోట్ల భారి ప్యాకేజి ప్రకటించారు. కరోనా కట్టడికి వ్యక్తిగతంగా సామాజిక దూరం పాటిస్తూనే మరో వైపు ఆర్థిక వ్యవస్థను కాపాడుకునే రీతిలో అడుగులు వేసేందుకు ఈ ప్యాకేజి తోడ్పడుతుంది. భారత్ బలమైన ఆర్థిక వ్యవస్థగా మారేందుకు ఈ పాకెజి ఉపయోగపడుతుందని ప్రధాన మంత్రి  పేర్కౌన్నారు. కరోనా మహమ్మారి కట్టడి కోసం దేశ ప్రధాని నరేంద్ర మోది మంగళవారం రాత్రి 8 గం. దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడారు.
కరోనా పరిస్థితులను నియంత్రిస్తూనే మేకిన్ ఇండియా కలలు సాకారం చేయడానికి ప్యాకేజి తోడ్పడుతుందని చెప్పారు. పని సామర్ద్యం
, ఉత్పత్తి, నాణ్యతా ప్రమాణాలన్నింటిలో నూతన శకానికి నాంది పలకాలని అన్నారు.
ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కింద పరిశ్రమలను సంస్థలను ఎట్లా ఆదుకుంటారో ప్రభుత్వం 18 వ తేదీన విధివిదానాలు ప్రకటించనుంది. ఆర్థిక పాకేజి పూర్తి వివరాలు ఆర్తిక మంత్రి నిర్మలా సీతారామని వెల్లడిస్తారని ప్రధాని తెలిపారు.
  ప్యాకేజి కింద సామాన్యులను, రైతులను రైతుకూలీలలను, వలస కార్మికులను మొదలు కొని అన్ని రంగాలకు చెందిన వారిని ఆదుకుంటారనే ఆశా భావం వ్యక్తం అవుతోంది.పరిశ్రమలకు భారి ఊరట కలిగించే రీతిలో తోడపాటు లభిస్తుందని అంటున్నారు.
21వ శతాబ్దపు ఆకాంక్షలకు తగినట్టుగా ఈ ప్యాకేజీ రూపకల్పన చేశామని మోదీ చెప్పారు. నూతన ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు ఇది దోహదం చేస్తుందని తెలిపారు. ఈ ఆర్థిక ప్యాకేజీ ప్రతి ఒక్కరికీ చేయూతనిస్తుందని చెప్పారు. దేశంలో ప్రతి పారిశ్రామికుడిని కలుపుకొని పోయేలా ప్యాకేజీ ఉపయోగపడుతుందని.. భారత పారిశ్రామిక రంగానికి మరింత బలాన్ని చేకూర్చేందుకు దోహదపడుతుందని మోదీ పేర్కొన్నారు.
ముఖ్యమంత్రులతో చర్చించి నాలుగో లాక్ డౌన్ నియమాలను ప్రకటిస్తామని ప్రధన మంత్రి తెలిపారు.


Post a Comment

0 Comments