About Me

పోటీపరీక్షల ఆన్లైన్ గడువు మే 20 వరకు పొడిగింపు

అమరావతి :  దేశవ్యాప్తంగా  లాక్‌డౌన్‌ విధించడంతో  ఎంసెట్‌తో సహా అన్ని ఉమ్మడి పరీక్షలను  వాయిదా వేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో ఎంసెట్‌, ఈసెట్‌, ఐసెట్‌ ప్రవేశ పరీక్షల తేదీలను ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది. లాక్‌డౌన్‌ అనంతరం పరీక్షలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఎంసెట్‌తో పాటు లాసెట్‌, ఐసెట్‌, ఎడ్‌సెట్‌, పీజీ సెట్‌, ఈసెట్‌ ‌ ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువును మే 20 వరకు పొడగించినట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ. హేమచంద్ర రెడ్డి వెల్లడించారు. 

Post a Comment

0 Comments