About Me

కోవిడ్-19 వ్యాక్సిన్ దిశగా భారత్


కోవిడ్-19 వ్యాక్సిన్ దిశగా భారత్ మరో కీలక ముందడుగు వేసేందుకు సిద్ధమవుతోంది. వ్యాక్సిన్ల తయారీలో ప్రపంచంలోనే పేరొందిన ప్రముఖ సీరమ్ ఇనిస్టిట్యూట్.. కోవిడ్ 19 వ్యాక్సిన్ ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం బ్రిటన్ లో క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్న వ్యాక్సిన్ విజయవంతం అయితే భారత్ లో ఆరు కోట్ల డోస్ లను ఈ సంవత్సరంలో ఉత్పత్తి చేసేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించింది.ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తున్న ఈ వ్యాక్సిన్ ఇప్పటికే జంతువుల్లో పరీక్షలు జరిపి మానవుల్లో ప్రయోగాలు మొదలు పెట్టింది.  అయితే వ్యాక్సిన్ విజయంతం కాగానే భారీ స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సీరమ్ ఇనిస్టిట్యూట్ సీఈవో అదర్ పూనా వాలా చెప్పారు. ఈ వ్యాక్సిన్ అభివృద్ధిలో ఎంతోమంది అత్యున్నతస్థాయి నిపుణులునిమగ్నమయ్యారని, అందుకే వ్యాక్సిన్ తొందరలో వస్తుందని ఆశాభావంతో ఉన్నామని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 1000 పరిశోధనలు జరుగుతుండగా వీటిలో ఐదు వ్యాక్సిన్లు ఫేజ్ 1 క్లినికల్ దశకు చేరుకున్నట్లు అంచనా వేశారు. ఇక ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ లో చేపడుతున్న పరిశోధనలు.. సెప్టెంబర్ నాటికి పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఒకవేళ ఇది విజయవంతం అయి అన్ని సవ్యంగా జరిగితే మాత్రం రానున్న సంవత్సరం కాలంలోనే దాదాపు 40 కోట్ల వ్యాక్సిన్ డోస్ లను తయారు చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిపారు.వీటిని భారత్ లోని పూణె కేంద్రంలో ఉన్న రెండు యూనిట్లలో తయారు చేయనున్నారు. ఒక్కో వ్యాక్సిన్ వెయ్యి రూపాయల ధరతో ప్రభుత్వానికి ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ ప్రజలకు మాత్రం ప్రభుత్వం ఉచితంగానే అందజేసే అవకాశం ఉంది. అయితే కోవిడ్ 19 వ్యాక్సిన్ తయారీ కోసం, కొత్త ఏర్పాటు చేసే యూనిట్ కోసం 6 వందల కోట్లు సీరం కంపెనీ బోర్డు ఈ మధ్యే ఆమోదం తెలిపింది..

Post a Comment

0 Comments