About Me

గూడ్స్ రైలు దూసుకు వెళ్ళి 16 మంది వలస కూలీలు దుర్మరణం


పట్టాల వెంట ప్రయాణం సాగిస్తూ రాత్రి కావడంతో పట్టాలపైనే నిద్రించిన కూలీలు
రైళ్ళు నడవడం లేదని భావించే పట్టాలపై నిద్రకు ఉపక్రమణ
గూడ్స్ రైళ్ళు నడుస్తున్నాయన్న  అవగాహన వైరికి లేకే ప్రమాదం.


ఔరంగాబాద్ సమీపంలో  శక్రవారం తెల్ల జామున పట్టాలపై నిద్రిస్తున్న వలస కూలీలపై గూడ్స్ రైలు దూసుకు వెళ్ళడంతో 16 మంది చనిపోయారు.ఈ ఘోర ప్రమాదంలో మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.కర్మాడ్ పోలీస్ స్టేషన్ పరిదిలో ఔరంగాబాద్ - నాందేడ్ రైలు మార్గంలో ఈ ప్రమాదం జరిగింది. వలసకూలీలు  జాల్నా నుంచి కాలి నడకన మద్యప్రదేశ్ కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.ఔరంగాబాద్ చేరుకున్న  తరువాత చీకటి పడడంతో రైల్వే పట్టాలపైనే  కూలీలు నిద్రించారు.లాక్ డౌన్ కారణంగా రైళ్ళు నడవడం లేదని నిద్రకు ఉపక్రమించారు కాని గూడ్స్ రైళ్ళు నడిచే విషయం వారి అవగాహనలో లేదు.పట్టాలపై నిద్రలో ఉండగానే గూడ్స్ రైళు దూసుకెళ్ళడంతో శరీరాలు తునా తునకలై పోయాయి. మృతుల్లో చిన్నారులు,మహిళలు ఉన్నారు.
దేశంలో కరోన లాక్ డౌన్ లో  పొట్ట గడవడం భారమైన వలస కూలీలు స్వంత గూటికి చేరుకునేందుకు పడుతున్న కష్టాలు అన్ని ఇన్ని కావు.వందల కీలోమీటర్లు కాలి నడకన నడిచి వెళుతూ అనేక ప్రమాదాలకు గురై చనిపోతున్నారు.ప్రబుత్వం ప్రత్యేక రైళ్ళు నడిపినా సరిపోవడం లేదు. వేచి చూసేకుంటే కాలి నడకనైనా సరే స్వంత గూటికి చేరుకోవాలనే పట్టుదలతో కూలీలు ఇతర విషయాలు ఏవి ఆలోచించ కుండా ప్రయాణాలు సాగిస్తున్నారు.
తీవ్రదిగ్ర్భాంతిని కలిగించిన ఈ సంఘటన పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోది సహా పలువురు ఆవేదన వ్యక్తం చేసారు.
'మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో రైలు ప్రమాదంలో కొందరు ప్రాణాలు కోల్పోవడం తెలుసుకుని చాలా బాధపడ్డాను. రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో మాట్లాడాను. అక్కడ పరిస్థితులను ఆయన పర్యవేక్షిస్తున్నారు. బాధితులను ఆదుకునేందుకు అన్ని రకాల సహాయ చర్యలు కొనసాగుతున్నాయి' అని మోదీ ట్వీట్ చేశారు.

Post a Comment

0 Comments