About Me

గ్యాస్ లీక్ మృతుల కుటుంబాలకు కోటి పరిహారం


మృతులకు కోటి రూపాయలు- గాయపడిన కటుంబాలకు 10 లక్షలు
కంపెనీ నుండి కూడ ఆర్థిక సహాయం అందేలా చూస్తామని హామి
మృతుల కుటుంబాలలో ఒకరికి కంపెనీలో ఉద్యోగం 
విశాఖ పట్నం ఎల్జీ కెమ్ పాలిమర్స్ పరిశ్రమలో విష వాయువు లీకైన ఘటనలో భాదితులకు ఎపి సిఎం జగన్మోహన్ రెడ్డి ఉదార సహాయం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు కోటి ఆర్థిక సహాయం చేస్తామని గాయపడినవారికిరూ 10 లక్షల సహాయం అందచేస్తామని తెలిపారు. గురువారం మధ్యాహ్నం ప్రమాద స్థలాన్ని ఆయన పరిశీలించి బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ.. గ్యాస్‌ లీక్‌ ఘటన చాలా బాధాకరమన్నారు. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న వారిక రూ.10 లక్షలు సాయం అందిస్తామన్నారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి రూ.లక్ష, స్వల్ప ప్రమాదానికి గురై ప్రాథమిక చికిత్స చేయించుకున్న వారికి రూ.25 వేలు ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు. బాధిత గ్రామాల్లోని 15 వేల మందికి ఒక్కొక్కరికి రూ.10 వేలు అందిస్తామన్నారు. చనిపోయిన జంతువుల యజమానులను ఆర్థికంగా ఆదుకుంటామని తెలిపారు. మృతుల కుటుంబాలకు కంపెనీ నుంచి ఆర్థిక సహాయం వచ్చేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఎల్‌జి కంపెనీలో బాధిత కుటుంబాలకు ఉద్యోగం కల్పించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
వెంకటాపురం–1, వెంకటాపురం–2, ఎస్సీ– ఎస్టీకాలనీ, నందమూరినగర్, పద్మనాభపురం గ్రామాల్లోని ప్రజలంతా ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ గ్రామాల్లోని దాదాపు 15వేలమంది ఉంటారని చెప్తున్నారు. వీరందరికీ రూ.10వేల చొప్పున ఆర్థిక సహాయం చేయాలని ఆదేశించినట్లు తెలిపారు.
చీఫ్ సెక్రెటరీతో పాటు  ఇన్‌ఛార్జి మంత్రి కన్నబాబు, డిప్యూటీ సీఎం ఆళ్లనాని, మంత్రులు అవంతి శ్రీనివాస్‌, బొత్స సత్యనారాయణ తదితరులను విశాఖపట్నంలోనే ఉండి సహాయక చర్యలు పర్యవేక్షించాలని చెప్పారు.

కూడా ఇక్కడే 

Post a Comment

0 Comments