About Me

కూతురు చనిపోయిన మూడు రోజులకు కళ్యాణ లక్ష్మీ చెక్.. కన్నీటి పర్యంతమైన తల్లి

ఆడ పిల్లలకు పెళ్లిళ్లు చేసే పేద తల్లిదండ్రులకు తెలంగాణ ప్రభుత్వం ‘కళ్యాణ లక్ష్మీ’ పథకం కింద ఆర్థిక సాయం చేస్తోన్న సంగతి తెలిసిందే. కళ్యాణ లక్ష్మీ పథకం చాలా కుటుంబాలకు ఆసరగా నిలుస్తోంది. ఆలస్యంగా ప్రసవం జరగడంతో.. నవజాత శిశువుతోపాటు తన కూతుర్ని కోల్పోయిన మూడు రోజుల తర్వాత ఓ తల్లికి ఎమ్మెల్యే చేతుల మీదుగా కళ్యాణ లక్ష్మీ చెక్ అందజేశారు. దీంతో కూతురు గుర్తొచ్చిన ఆ తల్లి కంటతడి పెట్టింది. 
గద్వాల జిల్లా రాజోలికి చెందిన జెనీలా అనే యువతికి 11 నెలల క్రితం అయిజ మండలం యాపదిన్నెకు చెందిన మహేంద్రతో వివాహమైంది. జెనీలా పెళ్లి కోసం తల్లి వజ్రమ్మ అప్పులు చేయాల్సి వచ్చింది. పెళ్లయిన కొన్నాళ్లకే గర్భం దాల్చిన జెనీలాకు ఏప్రిల్ 24న పురిటి నొప్పులు వచ్చాయి. అంబులెన్స్‌కు ఫోన్ చేసినా రాకపోవడంతో ఆమె భర్త ఆటోలో ఎక్కించుకొని గద్వాల ప్రభుత్వ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. 

బీపీ ఎక్కువగా ఉందని, రక్తం తక్కువగా ఉందని డాక్టర్లు చెప్పడంతో మహేంద్రకు ఏం చేయాలో పాలుపోలేదు. కలెక్టర్ జోక్యం చేసుకొని గర్భిణిని అంబులెన్స్‌లో మహబూబ్‌నగర్ హాస్పిటల్‌కు పంపించారు. కానీ పరిస్థితి బాగోలేకపోవడంతో డాక్టర్లు ఆమెను హైదరాబాద్ రిఫర్ చేశారు. పేట్లబురుజు హాస్పిటల్లో జెనీలా మగబిడ్డకు జన్మనిచ్చింది. కానీ ఇద్దరూ అస్వస్థతకు గురవడంతో.. బిడ్డను నిలోఫర్‌కు, తల్లిని గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. ఏప్రిల్ 25న బాబు చనిపోగా.. రెండు రోజుల తర్వాత జెనీలా కూడా ప్రాణాలు వదిలింది. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా సుమోటోగా స్వీకరించిన మానవ హక్కుల సంఘం కేసు నమోదు చేసింది.

Post a Comment

0 Comments